భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజలు క్రితం రెండు, మూడు వేలలోపు ఉన్న కేసులు తాజాగా ఏకంగా పదివేలకు చేరాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 12, 781 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం కరోనా కేసులకు సంబంధించి బులెటెన్ విడుదల చేశారు.
” గడచిన 24 గంటల్లో కొత్తగా 12, 781 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 76,700కు చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 0.18గా ఉంది. కరోనా వైరస్‌తో నిన్న ఒక్కరోజే 18 మంది మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 5,24,873కు చేరుకుంది. కోవిడ్ మరణాల శాతం 1.21 గా నమోదైంది. ఇక, గడచిన 24 గంటల్లో 8,537 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 27లక్షల 7,900కి చేరుకుంది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది.”
మరోపక్క కొన్ని రోజులుగా కొత్త కేసులతో పొలిస్తే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య తగ్గుతుండటం మంచి పరిణామం అని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 2,80,136 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని, దేశంలో ఇప్పటిదాకా అందించిన కరోనా డోసుల సంఖ్య 196 కోట్ల 18 లక్షల 66, 707గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.