నేడు తెలంగాణలో 129 కేసులు.. 99కి చేరిన మృతులు  - MicTv.in - Telugu News
mictv telugu

నేడు తెలంగాణలో 129 కేసులు.. 99కి చేరిన మృతులు 

June 3, 2020

 

129 Positive.

9 అంకెను ముడిపెట్టుకున్నట్టే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మొన్న 199 కేసులు నమోదవగా, నిన్న 92 కేసులు నమోదయ్యాయి. తాజాగా నేడు తెలంగాణలో 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 

వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 108 కేసులు నమోదవగా, రంగారెడ్డిలో 6 కేసులు, ఆసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చల్‌లో 2, సిరిసిల్లా 2, యాదాద్రి భువనగిరి జిల్లా 1, కామారెడ్డి 1, మహబూబ్ నగర్ 1, వలస కార్మికులలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ 7గురు మృతిచెందగా.. మృతుల సంఖ్య 99కి చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,020 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,556కు చేరుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,365 కేసులు ఉన్నాయి.