మాడుగులలో 13 అడుగుల కోడెత్రాచు పట్టివేత - MicTv.in - Telugu News
mictv telugu

మాడుగులలో 13 అడుగుల కోడెత్రాచు పట్టివేత

May 9, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా మాడుగుల మండలంలో 13 అడుగుల భారీ కోడెత్రాచు (కింగ్‌కోబ్రా) పట్టుబడింది. సైదారావు రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో కొంతమంది కూలీలు పామాయిల్‌ గెలలు కోస్తుండగా, ఆ కోడెత్రాచు కదలికలను గుర్తించి, యజమానికి చెప్పారు.

దాంతో అప్రమత్తమైన రైతు సైదారావు.. వెంటనే ఈస్ట్రన్‌ ఘాట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ సభ్యుడైన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌కి ఫోన్ చేశాడు. ఘటన స్ధలానికి చేరుకున్న వెంకటేశ్ చాకచక్యంగా కింగ్‌కోబ్రాని పట్టుకున్నారు. అనంతరం గోనె సంచిలో పెట్టి, వంట్ల మామిడి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దాంతో కూలీలు, రైతు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.