భారత్‌లో మే నెలకల్లా 13 లక్షల కరోనా కేసులు! - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో మే నెలకల్లా 13 లక్షల కరోనా కేసులు!

March 25, 2020

13 lakh cases presumed in mid may month 

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూపోతే ఉపద్రవం తప్పతని వైద్యనిపుణుల బృందం హెచ్చరించింది. మే నెల మధ్య నాటికల్లా మన దేశంలో 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని కోవిడ్-19 స్టడీ గ్రూప్ తెలిపింది. ఈ బృందంలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. 

వారి పరిశీలనలు, అంచనాల ప్రకారం.. మార్చి 18 నాటికి మన దేశంలో కేవలం 11500 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారు. మన దేశంల కరోనాకు సంబంధించి స్టేజ్ 2, స్టేజ్ 2లలోకి అడుగు పెడుతోంది. అమెరికా, ఇటలీల్లో మొదట తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ తర్వాత ఉన్నట్లు వేల కేసులను గుర్తించారు. మన దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి ముప్పు ఉంది. దీనికి తోడు మనదేశంలో సరైన వైద్యసదుపాయాలు లేవు. ప్రతి వెయ్యమందికి కేవలం 0.7 పడక మాత్రమే ఉంది. అదే ఫ్రాన్స్ లో 6.5, దక్షిణ కొరియాలో 12, చైనాలో 4, ఇటలీలో మూడు, అహెరికాలో 3 ఉన్నాయి. ఈ పరిస్థితిలో కరోనాకు అడ్డుకట్టవేయకపోతే పరిస్థితి దారుణంగా ఉండొచ్చు.