13 new mandals in Telangana
mictv telugu

బ్రేకింగ్ : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు.. జీవో జారీ

July 23, 2022

13 new mandals in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఆ మేరకు జీవో జారీ చేశారు. ఏర్పాటయిన మండలాలలో గట్టుప్పల్ (నల్గొండ), గుండుమల్, కొత్తపల్లె (నారాయణ పేట), దుడ్యాల్ (వికారాబాద్), కౌకుంట్ల (మహబూబ్ నగర్), ఆలూరు, సాలూర, డొంకేశ్వర్ (నిజామాబాద్), డోంగ్లీ (కామారెడ్డి), సిరోల్ (మహబూబాబాద్), నిజాంపేట్ (సంగారెడ్డి), ఎండపల్లి, భీమారం (జగిత్యాల)లను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా, 2016లో కొత్త జిల్లాలు, మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత కొన్ని ప్రాంతాలలో మండలాల ఏర్పాటుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ముఖ్యంగా నల్గొండలోని గట్టుప్పల్ మండలం ఏర్పాటుకు అక్కడి ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారు. ఇప్పుడు వారి కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చడంతో వారితో పాటు ఆయా కొత్త మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.