13 people in total
mictv telugu

కటకటాల్లోకి నిత్యపెళ్లికొడుకు..మొత్తం 13మంది

July 21, 2022

హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని, నెలకు రూ.2లక్షల జీతం వస్తుందని మ్యాట్రిమోన్‌లో వరుడు (రెండవ మ్యారెజ్) కావాలని ప్రకటన చేసిన పలువురు మహిళలను టార్గెట్ చేసి, వారిని పెళ్లి చేసుకొని, వారి వద్ద నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసిన నిత్యపెళ్లికొడుకు అడపా శివ శంకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొదటగా అడపా శివ శంకర్ ఏడుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడని, పలు కథనాలు బయటికొచ్చాయి. కానీ, పోలీసుల విచారణలో ఏడుగురు మహిళలను కాదు, మొత్తం 13మంది మహిళలను మోసం చేసినట్లు శివ శంకర్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్ళి చేసుకుని మోసం చేసిన నిత్యపెళ్ళి కొడుకు శివశంకర్‌ను అదుపులో తీసుకున్నాం. శివశంకర్‌పై హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో కేసులు నమోదయ్యాయి. శివశంకర్‌ను అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు రోడ్డెక్కారు. దాంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్నాం. శివశంకర్‌.. అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసి, ఆ యువతి నుంచి 35 లక్షలు వసూలు చేసాడు” అని వెల్లడించారు.

ఇక శివ శంకర్ విషయానికొస్తే.. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన వ్యక్తి. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని, మొత్తం 13 మంది యువతులను మోసం చేశాడు. పెళ్లై, విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేసి, ఈ ఘటనకు పాల్పడ్డాడు. పెద్ద కంపెనీలో పనిచేస్తానని డే అండ్ నైట్ డ్యూటీలు ఉంటాయని, ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గరి వెళ్తూ కాలం వెళ్లదీశాడు. పెళ్లి చేసుకున్న వారందరినీ ఎక్కడెక్కడో ఉంచకుండా, పక్కపక్క వీధుల్లోనే ఉంచి ఎవరికీ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే.. శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు జూలై 14న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈ నిత్య పెళ్లికొడుకు బాగోతాన్ని బయటపెట్టారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేస్తున్నారు.