13 sand tractors hit the toll plaza in uttar pradesh
mictv telugu

వైరల్ వీడియో : టోల్ ప్లాజాను గుద్దుకుంటూ వెళ్లిన 13 ఇసుక ట్రాక్టర్లు

September 5, 2022

దేశంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ మధ్య తమ వ్యాపారానికి అడ్డొచ్చిన అధికారులు, పోలీసులను వాహనాలతో తొక్కి చంపి మరీ దర్జాగా వెళ్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు మరో ఘటన అక్కడ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా – గ్వాలియర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ టోల్ ప్లాజా వద్ద ఇసుక ట్రాక్టర్లు ఆదివారం బీభత్సం సృష్టించాయి. టోల్ గేటు వద్దకు చేరిన 13 ట్రాక్టర్లను సిబ్బంది డబ్బు అడగడంతో కోపోద్రిక్తులైన డ్రైవర్లు.. బారికేడ్లను గుద్దుకుంటూ ఆగకుండా వెళ్లిపోయారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవడంతో సంచలనంగా మారింది. తర్వాత సిబ్బంది కర్రలతో ట్రాక్టర్లపై వెళ్తున్న డ్రైవర్లను కొడుతుండడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించి ఇప్పటికే తగిన చర్యలు ప్రారంభించగా, నెటిజన్లు మాత్రం మాఫియాను ఎలాగైనా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.