రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

September 21, 2020

gnvgn

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల వరకు  సగటున రెండు వేల కేసులు నమోదయ్యాయి. నిన్న మాత్రం కేవలం 1,302 కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి పెరిగింది. కొత్తగా 2230 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

ఇప్పటి వరకు 1,41,930 కరోనా బాధితులు ఈ మహమ్మారిని జయించారు. గడిచిన 24 గంటల్లో 9 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ 1,042 మందిని బలితీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వారిలో 22,990 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 0.60శాతం మరణాల రేటు, 82.22శాతం రికవరీ రేటు ఉంది. ఇక పరీక్షల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 31,095 వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 25,19,315 పరీక్షలు నిర్వహించారు.