Home > Featured > తెలంగాణలో 1,326 పోస్టులు నిలిపివేత

తెలంగాణలో 1,326 పోస్టులు నిలిపివేత

1,326 posts suspended in Telangana

తెలంగాణ రాష్ట్రంలో 1,326 వైద్యులు, ట్యూటర్ల పోస్టుల భర్తీకి సంబంధించి వైద్య సేవల నియామక సంస్థ గతంలో ఇచ్చిన ప్రకటన నుంచి ట్యూటర్ల నియామక ప్రక్రియను నిలిపివేస్తూ, తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం పోస్టుల్లో 357 ట్యూటర్ పోస్టులున్నాయి.

అయితే, ఈ ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత అవసరం లేదని, సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ పూర్తి చేసి, అందులో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణించాలని తాజాగా జాతీయ వైద్య కమిషన్(ఎస్ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వీరిని కూడా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని సూచించింది. దీంతో ఈ మేరకు అవసరమైన సవరణ నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉండడంతో.. తాత్కాలికంగా ట్యూటర్ల నియామక ప్రక్రియను నిలిపివేసినట్లు వైద్య సేవల నియామక సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించింది.

అనంతరం మిగిలిన 969 వైద్యుల పోస్టులకు మాత్రం దరఖాస్తుల ప్రక్రియను కొనసాగిస్తామని వైద్య సేవల నియామక సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు వచ్చే నెల 14న సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, అర్హులైన వారు పోస్టులకు అధికారికి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

Updated : 23 July 2022 12:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top