సీసాలో భద్రంగా దాగిన సరదా సందేశం! - Telugu News - Mic tv
mictv telugu

సీసాలో భద్రంగా దాగిన సరదా సందేశం!

November 21, 2022


కొన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోవాలని వస్తువులను ఎక్కడో పెడుతాం. ఎప్పటికో గానీ అవి బయటకు రావు. అలా ఒక సందేశం 135 యేండ్ల తర్వాత బయటకు వచ్చింది.
శివమణి సినిమా గుర్తుందా? అందులో సీసా సందేశం పంపిస్తాడు హీరో. ఆ కథ చదివి హీరో, హీరోయిన్లను వెతుకుతూ ఒక అమ్మాయి వెతుకులాట మొదలుపెడుతుంది. ఇలా జరుగుతుందా? అని మనకు అనిపించొచ్చు. అచ్చు అలాంటి సందేశమే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది. స్కాట్లాండ్లో 135 సంవత్సరాల క్రితం ఒక కాగితాన్ని రాసి విస్కీ బాటిల్లో దాచారు. అది కూడా ఫ్లోర్ కింద. ఇద్దరు సరదాగా రాసిన సందేశం ఇన్ని సంవత్సరాలకు బయట పడడం నిజంగా విచిత్రం. 1887లో ఈ బాటిల్ని దాచినట్లుగా అందులో సందేశం చెబుతున్నది.

ఈ ఇంటికి ఇలిద్ సింసన్.. ఈ ఇంటి ఓనర్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంటిని కొన్నాడు. పైప్లైన్ లీకేజ్, ఇతర సమస్యలు రావడంతో.. ఫ్లోరింగ్ మార్చాలని అనుకున్నాడు. దానికి ఒక ప్లంబర్ని మాట్లాడాడు. అతను వాచ్మెన్ గదిలో పని చేస్తున్నాడు. పైప్లైన్ కోసం ఒక టైల్ని తీశాడు. తీయగానే షాక్ అయ్యాడు. వెంటనే సింసన్ భార్యను పిలుచుకొచ్చాడు. ఆ టైల్ కింద బాటిల్ చూపించాడు. అందులో ఒక కాగితం మడిచి ఉండడం చూసి షాక్కి గురయ్యారు. ఆ కాగితంలో ‘జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీవీ అనే మేం ఈ విస్కీ తాగలేదు. 6 అక్టోబర్ 1887లో ఈ బాటిల్ని దాస్తున్నాం. ఇది ఎవరు తీస్తారో అప్పుడు మా సందేశం బయటకు వస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. వాళ్లు రాసిన ఆ కాగితం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది.