1,381 కేజీల బంగారం పట్టివేత.. టీటీడీది అంట.. - MicTv.in - Telugu News
mictv telugu

1,381 కేజీల బంగారం పట్టివేత.. టీటీడీది అంట..

April 17, 2019

ఎన్నికల వేల నోట్ల కట్టలే కాదు, బంగారం గుట్టలూ పలుగుతున్నాయి. తమిళనాడు ఎన్నికల అధికారులు కనీనినీ ఎరగనంత బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలోని వెప్పంపట్టు ప్రాంతంలో వెళ్తున్న వాహనంలో 1,381 కిలోల బంగారం దొరికింది.

1381 kg gold seized by elections checking squad in Chennai accused and ttd official says it is theirs.

వాహనాన్ని జప్తు చేసి  పూందమల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి అప్పగించారు. అందులోని బంగారమంతా తిరుమల తిరుపతి దేవస్థానానిది అని వాహనంలోని నిందితులు చెప్పారు.  అయితే వారి వద్ద ఎలాంటి అధికారిక పత్రాలూ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదంతా శ్రీవారి బంగారమేనని, టీడీడీ అధికారులు కూడా చెప్పారు. చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మూడేళ్ల కిందట ఆ బంగారాన్ని డిపాజిట్‌ చేశామని, డిపాజిట్ గడువు ముగియడంతో తిరిగి తీసుకొస్తున్నామని వివరిస్తున్నారు.