139 మంది రేప్ కేసు.. డాలర్ బాయ్ అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

139 మంది రేప్ కేసు.. డాలర్ బాయ్ అరెస్ట్ 

October 23, 2020

nfgngn

2011 నుంచి ఇప్పటివరకు  తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆగస్టు 20న ఆమె ఫిర్యాదు చేసింది. వీడియోలు, ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ కేసులో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, నటుడు కృష్ణుడి పేర్లు బయటకు వచ్చాయి. తర్వాత వారిద్దరికి దీనితో సంబంధం లేదని సదరు యువతి పలు యూట్యూబ్ ఛానెళ్లలో చెప్పుకొచ్చింది. అలాగే వరుస ఇంటర్వ్యూలలో ఆ యువతి 39 మందే తనను రేప్ చేశారని చెప్పింది. దీంతో సదరు యువతి ఆరోపణలతో పోలీసులకు జుట్టు పీక్కున్నంత పనైంది. 

ఈ లైంగిక దాడులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడు ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు డాలర్ బాయ్‌ను ఇవాళ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ రోజు అతన్ని రిమాండ్‌కి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే పోలీసులు విచారించారు.