జార్ఖండ్ వివాహ వేడుకలో ఘోర అగ్నిప్రమాదం..14మంది మృతి..!! - Telugu News - Mic tv
mictv telugu

జార్ఖండ్ వివాహ వేడుకలో ఘోర అగ్నిప్రమాదం..14మంది మృతి..!!

February 1, 2023

 

Jharkhand

జార్ఖండ్‎లో ఘోరఅగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 14మంది మరణించారు. 20మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటన ధన్ బాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటుచేసుకుంది. 13వ అంతస్థుల భవనంలోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగాయి. అనంతరం భవనం అంతా వ్యాప్తించాయి. మరణించివారిలో ముగ్గురు చిన్నారు…10మంది మహిళలు ఉన్నారు. ఈ మంటలు వ్యాపించిన అపార్ట్ మెంట్ లో 4వందల మంది నివసిస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు చాలా మందికి తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్రిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మొత్తం పది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఇప్పటికి ఆ ప్రాంతంమంతా ఆందోళనకరంగానే ఉంది. భవనం మొత్తం తగలబడింది. సీఎం హేమంత్ సోరెన్ పరిస్థితిని సమీక్షించారు.

ప్రధాని ఎక్స్ గ్రేషియా…
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గాయపడిన వారికి 50వేల చొప్పున ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు.