14 Killed In Shooting At US Walmart Store, Gunman Dead Too
mictv telugu

వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు..14 మంది మృతి

November 23, 2022

14 Killed In Shooting At US Walmart Store, Gunman Dead Too

అమెరికాలోని మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌ లో కాల్పుల మోత మోగింది. స్టోర్‌లో పనిచేసే మేనేజర్ ఇతర ఉద్యోగులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు అక్కడికి చేరుకునే‌లోపే కాల్పులు జరిపిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో చీసాపీక్ లోని సామ్ సర్కిల్‌ లో ఉన్న వాల్‌మార్ట్‌ దగ్గర భయానక వాతావరణం నెలకొంది. చనిపోయిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.