యూపీలో మళ్లీ అదే  ఘోరం.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్,హత్య  - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో మళ్లీ అదే  ఘోరం.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్,హత్య 

October 2, 2020

యూపీలో అత్యాచారాల పర్వానికి ఏ మాత్రం తెరపడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళలు, బాలికలు, యువతులపై లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల హత్రాస్ ఘటన తర్వాత అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో మళ్లీ అలాంటి ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. గోపీగంజ్ ప్రాంతంలో జరిగింది.  బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

 14 ఏళ్ల బాలిక గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. తలపై బండరాయితో బలంగా కొట్టారు. తీవ్ర రక్త స్రావంతో అక్కడే ప్రాణాలు వదిలింది. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా శవమై కనిపించింది. దీంతో పొరుగునే ఉన్నవారిపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని శుక్రవారం ఉదయం ముగ్గురు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. శత్రుత్వం  కారణంగా ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అత్యాచారం జరిగిందో లేదో తెలియాల్సి ఉందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.