14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశాడు  - MicTv.in - Telugu News
mictv telugu

14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశాడు 

February 15, 2020

doctor

డాక్టర్ కోర్సు చేస్తుండగానే ఓ హత్య కేసులో జైలుపాలై 14 ఏళ్ల తర్వాత వచ్చి కూడా తిరిగి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు ఓ వ్యక్తి. కర్నాటకలోని ఓ డాక్టర్ ఈ ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళ ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు అప్పటికే వివాహం కావడంతో వీరి వ్యవహారం భర్తకు తెలిసింది. దీంతో వీరిని హెచ్చరించడంతో అతని అడ్డు తొలగించుకునేందుకు చంపేశారు. ఆ కేసులో ఇద్దరూ శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యారు. 

బయటకు వచ్చిన తర్వాత సుభాష్ తన చదువును కొనసాగించాలని అనుకున్నాడు. క్షణికావేశంలో చేసిన తప్పుతో పరివర్తన చెందిన అతడు తిరిగి ఎంబీబీఎస్‌లో సీటు సంపాధించుకొని 2019లో పూర్తి చేశాడు. ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి కావడంతో కర్ణాటకలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జైలులో గడిపినన్ని రోజులు చదవడంపైనే దృష్టిపెట్టినట్టు అతడు తెలిపాడు. వైద్యుడిగా మంచి సేవలు ప్రజలకు చేయడమే తన ముందు ఉన్న లక్ష్యమని చెబుతున్నాడు. క్షణికావేశంలో తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని అతడు సూచించాడు.