140 కోట్ల విరాళం ఇచ్చిన అవ్వ...! - MicTv.in - Telugu News
mictv telugu

140 కోట్ల విరాళం ఇచ్చిన అవ్వ…!

September 2, 2017

కోట్లు సంపాదించి స్విస్ బ్యాంకుల్లో ,బిర్వాల్లో దాచుకుంటారు కొంతమంది, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా అనుకుంటూ ప్రశాంతంత కోల్పోయి డబ్బు వెనక పరుగెడతారు, కానీ ఎంత సంపాదిస్తే ఏం లాభం, రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు, వాళ్లు సంపాదించింది చివరకు బీరువాల్లో ,బ్యాంకుల్లో చెదలు పట్టడం తప్ప, పోయేటప్పుడు చిల్లి గవ్వకూడా వెంట తీసుకెళ్లం అనే విషయం మర్చిపోతుంటారు.

అమెరికాకు చెందిన 93 ఏండ్ల ఓ అవ్వ ఆ విషయాన్ని బాగా అర్ధచేసుకుంది. అందుకే తన ఆస్తి మొత్తం దాదాపు 140 కోట్లు  జర్మనీలో ఉన్న ఓ జూకి విరాళంగా ఇచ్చింది. అయితే అమెరికా అవ్వ జర్మనీలోని జూకి విరాళం ఇవ్వడానికి ఓ కారణం ఉందండోయ్..రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తన భర్తను అక్కడే చూసిందట.ఆ త‌ర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అక్కడే స్థిర‌ప‌డ్డవాళ్లు మిలియ‌న్ల డాల‌ర్లు సంపాదించారు. అయితే వీరికి సంతానం ఎవ్వరూ లేకపోవడంతో జూకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.