140 inmates of Uttar Pradesh's Dasna Jail diagnosed with HIV
mictv telugu

ఆ జైలులో 140 మందికి ఎయిడ్స్..

November 19, 2022

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ దస్నా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది ఖైదీలు హెచ్ఐవీ భారీన పడ్డారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్లు దస్నా జైలు అధికారి అలోక్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. 2016లో ఘజియాబాద్‌ దస్నా జైల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా అప్పుడు 49 మందికి మాత్రమే ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 140కి చేరింది. 2016 నుంచి సరాసరి 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ సోకిన ఖైదీలు ఆ జైల్లో ఉంటున్నారు. జైలు ఆస్పత్రిలోనే హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఒకరికి వాడిన ఇంజక్షన్‌ను మరొకరికి వాడటం వల్లే హెచ్ఐవీ పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో మిగితా ఖైదీలు కూడా హెచ్ఐవీ బారిన పడతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయింది. జైలులో 1706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5500 మంది ఖైదీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.