తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. నిన్న 1,221 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,29,001 కేసులు నమోదయ్యాయి. అలాగే 1,298 మంది పౌరులు కరోనాతో మరణించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 20,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,07,326 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,214 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదయ్యాయ్యి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 90.38 శాతం ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 89.2 శాతం ఉంది.