తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసుల - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసుల

October 22, 2020

nngn

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,456 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఐదుగురు కరోనా బాధితులు మరణించారు. నిన్న 1,717 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,27,580 కేసులు నమోదయ్యాయి. 

అలాగే 1292 మంది పౌరులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,06,105 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 16,977 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 90.38 శాతం ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 89.2 శాతం ఉంది.