తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు

October 20, 2020

nvnn

తెలంగాణలో నిన్న 1,486 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. కరోనాతో నిన్న ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,282కి చేరింది. 

నిన్న కొత్తగా 1,891మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,02,577కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక పరీక్షల విషయానికి వస్తే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 42,299 కరోనా వైరస్ టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 38,98,829 టెస్టులు చేశారు.