అమర్నాథ్ యాత్రలో మరో ఘోరం చోటుచేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని కాజికుండ్ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురై 15 మంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై బద్రాకుండ్ క్రాసింగ్ వద్ద బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, ఇటీవలే వరదల వల్ల 16 మంది యాత్రీకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో అధికారులు యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి గురువారం ఐదు వేల మంది యాత్రికులు బయల్దేరారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదాలు కాక, ఆరోగ్య సమస్యలతో ఇప్పటివరకు 11 మంది యాత్రికులు మరణించారు. ఈ యాత్ర ఆగస్టు 11న రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణిమ రోజున ముగుస్తుంది.