15 lip locks anu emmanuel skin show saves the urvasivo rakshasivo movie
mictv telugu

15 లిప్ లాక్స్.. స్క్రీనంతా స్కిన్ షో.. ఒక్క హిట్టు కోసం ఇంతగా దిగజారాలా ?

November 5, 2022

లిప్ లాక్స్ పీక్స్ లో ఉండటంతో అల్లు శిరీష్ తన చిరకాల కోరికని ఎట్టకేలకు తీర్చుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ షోకి తోడు డేటింగ్ ఇష్యూతో వచ్చిన ఫ్రీ పబ్లిసిటీ కారణంగా శిరీష్ కి కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. రాకేష్ శశి దర్శకత్వంలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిన్న విడుదలైన `ఊర్వశివో రాక్షసివో`తో ఇన్నేళ్లకు హిట్ కొట్టేసాడు అల్లు శిరీష్. దాదాపు మూడేళ్ళ తరువాత చేస్తున్న సినిమా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల కావటంతో కాస్త భారీ అంచనాలే నమోదవ్వగా.. హాట్ సీన్స్ తో యూత్ కి పిచ్చెక్కించేసాడు శిరీష్. కెరీర్ లో అక్కడక్కడా యావరేజ్ సినిమాలు ఉన్నా.. సరైన హిట్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న శిరీష్ కి `ఊర్వశివో రాక్షసివో` బిగ్ బ్రేక్ అని అంటున్నారు. కేవలం యూత్ ని టార్గెట్ చేయటంతో రిజల్ట్ ఈ సారి ఈజీ అయిపోయింది. సినిమా మొత్తం లిప్ లాక్స్ తో నింపేశారు మేకర్స్.

ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కి దాదాపు 15కి పైగా లిప్ కిస్ లు పెట్టాడు అల్లు శిరీష్. ఎప్పటి నుండో మంచి బ్రేక్ కోసం చూస్తున్న అను బేబీ కూడా హద్దులు చెరిపేసింది. మిగితా సినిమాలకంటే ఇందులో రెచ్చిపోయి స్కిన్ షో చేసింది. అల్లు శిరీష్ బాండింగ్ బావుండటంతో ఇద్దరి మధ్య తెరపై కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా కుదిరింది. ఇక కామెడీ సీన్స్ సైతం బూతులతో లాక్కోచ్చేసారు. ఈ సినిమా మనకి డైరెక్టర్ మారుతీ కెరీర్ మొదట్లో తీసిన బూతు సినిమాలని గుర్తుచేస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే యూత్ కి నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా మరి ఫ్యామిలీస్ కి ఎక్కటం కష్టమే అంటున్నారు. అల్లు అరవింద్ లాంటి మెగా ప్రొడ్యూసర్ నుండి ఫ్యామిలీస్ ఆశించే సినిమా ఇది కాదు అని.. కొడుకుకి ఒక్క హిట్టు కోసం అల్లు అరవింద్ ఇంతగా దిగజారాలా అని కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. ఏదేమైనా అల్లు శిరీష్ `ఊర్వశివో రాక్షసివో`తో తోలి హిట్ కొట్టాలన్న చిరకాల కోరికని తీర్చేసుకున్నాడు.