ఏపీలో 15 సినిమా థియేటర్లు సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో 15 సినిమా థియేటర్లు సీజ్

December 22, 2021

11

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా సినిమా టికెట్లపై, సినిమా థియేట్లరు పాటిస్తున్న నిబంధనలపై ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకొని, తనిఖీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే, బుధవారం కృష్ణా జిల్లాలో 15 సినిమా థియేట్లరను సీజ్ చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలైయ్యాయి.

ఎందుకు ఆ థియేటర్లను సీజ్ చేస్తున్నారు..? అసలు కారణం ఏంటి అనే సందేహాలు సినీ ప్రియుల్లో రేకెత్తుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు పలు విషయాలను వెల్లడించారు. టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రొటోకాల్ పాటించలేదని, తమ సోదాల్లో రుజువైందని పేర్కొన్నారు. అంతేకాకుండా తినుబండారాల రేట్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించమన్నారు. ఇకపై మల్టీప్లెక్స్‌లతో పాటు, అన్ని థియేటర్లలో ఫిక్సుడు రేట్లను నిర్ణయించనున్నామన్నారు. టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను కోర్టు కొట్టేయడంతో అంతకు ముందు ఉన్న రేట్లపై దృష్టి పెట్టమన్నారు.