15 new fire stations sanctioned by Telangana Government
mictv telugu

కొత్తగా 15 స్టేషన్లు, 382 ఉద్యోగాలు మంజూరు చేసిన ప్రభుత్వం

November 17, 2022

రాష్ట్రంలో కొత్తగా 15 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణ కోసం కొత్తగా 382 ఉద్యోగాలను కూడా ప్రకటించింది. ఇందులో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మంజూరైన కొత్త స్టేషన్లను ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాలలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆరు స్టేషన్లు హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు కానున్నాయి. మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అంబర్ పేట, చాంద్రాయణ గుట్ట, జాబ్లీహిల్స్ ప్రాంతాలు ఉండగా, మిగతావి షాద్ నగర్, కల్వకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటు వల్ల అగ్ని ప్రమాదాలను మరింత సమర్ధవంతంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.