ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో నేరాలపై దృష్టి సారించినా రైల్వే..ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయనుంది. ఇకపై రైల్వే కోచ్‌లు సీసీకెమెరాల నిఘాలో ఉండనున్నాయి. నేరాలను అరికట్టేందకు ప్రతీ కోచ్‌లోను సీసీకెమెరాలు అమర్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 2,930 రైలు కోచ్‌లను సీసీటీవీల ద్వారా కవర్ చేస్తున్న రైల్వే భవిష్యత్తులో 60,000 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. ముందుగా రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో 14,387 కోచ్‌లలో రైల్వే మంత్రిత్వ శాఖ CCTV కెమెరాలు అందుబాటులోకి తీసుకురానుంది. అనంతరం EMU, MEMU, DEMU వంటి ప్యాసింజర్ రైళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 15,000 కోచ్‌లలో రూ.705 కోట్ల విలువైన CCTVలను అమర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సీసీ కెమెరాల అమరికలో రైల్వే శాఖ జాగ్రత్తలు చేపట్టనుంది. ప్రయాణికుల ప్రైవసినీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైలు కోచ్‌లలో డోర్ దగ్గరి ప్రాంతం, వెస్టిబ్యూల్ ఏరియా, రెండు సీటు వరుసల మధ్యన ఖాళీ ప్రాంతం కవర్ చేసే విధంగా అమర్చనున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ CCTV కెమెరాలు వీడియో అనలిటిక్స్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంటాయి. ప్రతి కోచ్‌లో కనీసం రెండు పానిక్ బటన్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఆపద సమయంలో భద్రతా సిబ్బందికి సమాచారం అందిచొచ్చు.