అక్షయ తృతీయ.. ఎంత బంగారం అమ్ముడుపోయిందో తెలుసా - MicTv.in - Telugu News
mictv telugu

అక్షయ తృతీయ.. ఎంత బంగారం అమ్ముడుపోయిందో తెలుసా

May 4, 2022

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం సెంటిమెంటుగా భావించే మన సమాజంలో నిన్న దాదాపు రూ. 15 వేల కోట్ల రూపాయల మేర బంగారం విక్రయాలు జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది లాక్ డౌన్ లేకపోవడం, రంజాన్ సెలవుదినం కలిసి రావడం వంటి వాటితో అమ్మకాలు పుంజుకున్నాయని తెలిపింది. ముఖ్యంగా లైట్ జ్యుయలరీని ఎక్కువగా కొనుగోలు చేశారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2019తో పోల్చి చూస్తే అప్పటికేంటే కూడా ఈ సారి ఎక్కువ బంగారం అమ్ముడైంది. అప్పుడు బంగారం ధర 32,700 ఉండగా, వెండి కిలో రూ. 38,350గా ఉంది. ఇప్పుడు బంగారం రూ. 53 వేలు, వెండి కిలో ధర రూ. 66,600గా ఉంది. ధరలు ఇంతగా పెరిగినా అమ్మకాలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా వినియోగదారులు కొనుగోలుకు ఉత్సాహం చూపించారు.