గోవా సీఎం మనోహర్ పారికర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గోవా సీఎం మనోహర్ పారికర్ మృతి

March 17, 2019

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(63) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఆ కొద్ది సేపట్లోనే ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఆయన అమెరికాలో చికిత్స పొందారు. దిల్లీలోని ఎయిమ్స్‌, గోవా, ముంబయిలోనూ ఆయన చికిత్స పొందారు. అయితే గతనెలలో మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన మృతిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. తన తుది శ్వాస వరకు తాను ప్రజా సేవలోనే వుంటానని అన్నారు. ఆక్సీజన్ పైపుతోనే ఆయన తన విధులకు హాజరయ్యేవారు. ఆయన మరణంతో గోవా రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. 

Manohar Parrikar extremely critical Goa Chief Minister's Office.