తెలంగాణలో కొత్తగా.. 1,579 పాజిటివ్‌ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా.. 1,579 పాజిటివ్‌ కేసులు

October 21, 2020

1,579 new coronavirus cases in telangana

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చినా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,579 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే ఐదుగురు కరోనా బాధితులు మరణించారు. నిన్న 1,811 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో 2,26,124 కేసులు నమోదయ్యాయి. అలాగే 1287 మంది పౌరులు కరోనాతో మరణించారు. ప్రస్తుతంరాష్ట్రంలో 20,449 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,04,388 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,071 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 90.38 శాతం ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 88.8 శాతం ఉంది.