హైదరాబాద్‌లో 159 కంటైన్మెంట్ జోన్లు.. జాబితా ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో 159 కంటైన్మెంట్ జోన్లు.. జాబితా ఇదే

June 5, 2020

లాక్‌డౌన్ పొడిగిస్తున్నా దేశవ్యాప్తంగా కరోనా తగ్గడంలేదు. తెలంగాణలోనూ కరోనా మునుపటి కన్నా ఇంకా ఎక్కువ విజృంభిస్తోంది. ముఖ్యంగా హై‌దరాబాద్‌లో నిత్యం కేసులు పెరగడం హడలెత్తిస్తోంది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో.. కొత్త ప్రాంతాల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. నగరంలోని 159 ప్రాంతాల్లోని ఇళ్లను జూన్ 3 నాటికి  కంటైన్మెంట్‌లో ఉంచారు.

 

 కంటైన్మెంట్ జోన్ల జాబితా ఇలా..

containment

-సికింద్రాబాద్ జోన్‌లో 33 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో 6, ముషీరాబాద్‌లో 7, అంబర్‌పేటలో 13, మల్కాజ్‌గిరిలో 7 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కూకట్‌పల్లి జోన్ పరిధిలోకి వచ్చే మూసాపేట డివిజన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

 

-ఎల్బీనగర్ జోన్‌లో మొత్తం 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అందులో ఉప్పల్ సర్కిల్‌లో 16, సరూర్‌నగర్‌లో 4, హయత్‌నగర్‌లో 1 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

 

ఖైరతాబాద్ జోన్‌లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 35కి చేరింది. మెహదీపట్నంలో 5, కర్వాన్, జియాగూడ డివిజన్లలో 17, ఖైరతాబాద్‌లో 5, జూబ్లీహిల్స్‌లో 8 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

చార్మినార్ జోన్‌లో 28 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మలక్‌పేటలో 1, సంతోష్ నగర్‌లో 16, చాంద్రాయణ గుట్టలో 2, చార్మినార్‌లో 5, ఫలక్‌నుమాలో 4 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

రాజేంద్ర నగర్‌ నగర్ జోన్‌లోని రాజేంద్రనగర్, మణికొండ ప్రాంతాల్లో ఏడు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ డివిజన్‌లో 4, శేరిలింగంపల్లిలో 5 చొప్పున మొత్తం 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

 

-కుత్బుల్లాపూర్‌లో 7, మహేశ్వరం జోన్‌లోని జలపల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌‌పేటలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 159గా ఉంది. ఈ ప్రాంతాలు మొత్తం కంటైన్మెంట్‌లో లేవని.. వీటిలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.