తెలంగాణలో నేడు 1,590 కేసులు.. 1,166 మంది డిశ్చార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నేడు 1,590 కేసులు.. 1,166 మంది డిశ్చార్జ్

July 5, 2020

1,590 Positive.

తెలంగాణలో నేడు కరోనా ఏమాత్రం తగ్గలేదు. తన ప్రతాపాన్ని ప్రదర్శస్తూ నేడు 1,590 పాజిటివ్ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,277 పాజిటివ్ కేసులు నమోదవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక జిల్లాలవారిగా తీసుకుంటే.. మేడ్చల్‌లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేట్ 23, సంగారెడ్డి 19, మహబూబ్ నగర్ 19, నల్గొండ 14, కరీంనగర్ 4, వనపర్తి 4, నిజామాబాద్ 3, మెదక్ 3, నిర్మల్ 2, జనగాం2, వికారాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 2, గద్వాల్ 1, రాజన్న సిరిసిల్ల 1, సిద్దిపేట్ 1, వరంగల్ రూరల్ 1, నారాయణ్ పేట్ 1, పెద్దపల్లి 1, యాదాద్రి 1, కామారెడ్డి 1, అదిలాబాద్ 1గా మొత్తం 1,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 23,902కు పెరిగింది. ఇవాళ కరోనా చికిత్స పొందుతూ ఆరోగ్యంగా 1,166 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 12,703కు చేరింది. ఇవాళ కరోనాతో ఏడుగురు మృతిచెందగా ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 295కు పెరిగింది. కాగా, ప్రస్తుతం 10,904 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.