ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. నిషేధించిన ఖాతాలను కొత్త ఐటీ రూల్స్‌కు ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. దీంతో వాట్సాప్ యూజర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ ఖాతాలు ఎందుకో పనిచేయటం లేదోనని ఆందోళనకు గురైయ్యారు.
వాట్సాప్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..”భారతీయ యూజర్లు వాట్సాప్‌లో హానికర కార్యకలాపాలను వినియోగిస్తున్నారు. దాంతో కొందరు సంస్థకు ఫిర్యాదులు అందజేశారు. ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్న యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్నాం. అనుమానిత అకౌంట్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసినపుడు, ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి, కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 2021 కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫాంలకు చెందిన 50 లక్షల యూజర్లపై నెలవారీగా చేపట్టిన చర్యల నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి 30 వరకు వాట్సాప్ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించాం” అని వెల్లడించింది.
మరోపక్క వాట్సాప్‌లో వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్లీ ఎడిట్/రీ–రైట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుందని, ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉందని మొబైల్ మెసేజింగ్ సంస్థ తెలిపింది.