భారతీయులకు గుడ్ న్యూస్.. 16 దేశాలు వీసాలు అవసరం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులకు గుడ్ న్యూస్.. 16 దేశాలు వీసాలు అవసరం లేదు

September 23, 2020

visha

భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది. ఎలాంటి వీసా అనుమతి లేకుండానే తమ దేశం రావచ్చని పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో నేపాల్, మారిషస్, నియు ద్వీపం,మోంట్సెరాట్, సెయింట్ విన్సెంట్,సెర్బియా,గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి. 

వీటితో పాటు సాధారణ వీసా కలిగిన భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వీటిలో మయన్మార్, ఇరాన్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. మలేసియా,శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు.