సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో 16 మంది సైనికులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.