జూబ్లీహిల్స్ పబ్‌‌లో కిడ్నాప్.. బాలికపై గ్యాంగ్ రేప్ - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ పబ్‌‌లో కిడ్నాప్.. బాలికపై గ్యాంగ్ రేప్

June 2, 2022

పార్టీ పేరుతో 17 ఏండ్ల బాలికపై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో ఈ దారుణ జరిగింది. గత నెల 28 న శనివారం రాత్రి అమ్నీసియా & ఇన్సోమ్నియా పబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. స్నేహితులు పార్టీకి పిలిచారని బాధిత బాలిక పబ్‌కు వెళ్లగా.. ఆ రోజు రాత్రి బాలికపై సూరజ్, హాడీ అనే వ్యక్తులతో పాటు మరికొంతమంది దాడికి పాల్పడ్డారు. బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి స్పృహ కోల్పోయిన తర్వాత బాలికపై లైంగిక దాడి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువకులు సూరజ్‌, హాడీలను పోలీసులు విచారిస్తున్నారు.