177 Kashmiri Pandit Teachers Transferred To Srinagar Amid Recent Spate Of Targeted Attacks
mictv telugu

కేంద్రం సంచలనం.. 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్ల బదిలీ

June 4, 2022

177 Kashmiri Pandit Teachers Transferred To Srinagar Amid Recent Spate Of Targeted Attacks

జమ్మూకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీచర్ల బదిలీ నిర్ణయం వెలువడటం గమనార్హం.

1990ల్లో కశ్మీర్‌ లోయలో హిందు వర్గాలపై ఊచకోతతో ఆ ప్రాంతం నుంచి వేలాది కశ్మీరీ పండిట్‌ల కుటుంబాలు వలస వెళ్లాయి. అయితే వీరిని తిరిగి స్వస్థలాలకు రప్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్‌ లోయలో నియమించింది. వీరికి ఆర్థిక ప్యాకేజీలు కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది తిరిగి కశ్మీర్‌ లోయకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మళ్లీ ఉగ్రదాడులు జరుగుతుండడంతో తమను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని కశ్మీరీ పండిట్‌లు డిమాండ్లు చేస్తున్నారు.