18 రోజులకే నూరేళ్లు.. కారు ఢీకొట్టి పసికందు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

18 రోజులకే నూరేళ్లు.. కారు ఢీకొట్టి పసికందు మృతి

August 4, 2020

18 days baby boy passed away in road accident

మెదక్ జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం జరిగింది. రెండు రోజుల్లో నామకరణం వేడుక ఉండగా 19 రోజుల చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించింది. జిల్లాలోని శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన సార మురళి, అంజలి దంపతులకు ఇటీవలే బాబు జన్మించాడు. నలుగురు అన్నదమ్ముల కుటుంబంలో ఈ బాబు మొదటి మగ సంగతనం దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. కానీ, వారి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. 

ఇటీవల ఆ పసికందుకు విరేచనాలు అయ్యాయి. దీంతో మురళి దంపతులు చిన్నారిని తీసుకొని బైక్ పై తుప్రాన్ హాస్పిటల్ కి బయల్దేరారు. వారితోపాటు మురళి అన్న కూతురు కూడా బయల్దేరింది. నాగులపల్లి జంక్షన్ వద్ద హైవే పనులు జరుగుతుంటంతో బైక్‌ను వెనక్కి తిప్పారు. దీంతో వెనుక నుంచి వస్తోన్న ఓ బైక్, కారు వరుసగా ఢీకొట్టాయి. బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు శిశువు కూడా ఎగిరి పడ్డాడు. దీంతో ఆ చిన్నారి ఘటన స్థలిలోనే మరణించాడు. ఆ బాబు తల్లి తల, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమం ఉంది. 19 నెలల శిశువు మరణించడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అమలుకున్నాయి.