18 feet golden Ganesha..Here are the photos
mictv telugu

18 అడుగుల బంగారు వినాయకుడు..ఫోటోలు ఇవిగో

August 29, 2022

దేశవ్యాప్తంగా ఆగస్టు 31వ తేదీ నుంచి (నవరాత్రులు) వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలుకానున్నాయి. ఇప్పటికే ఊరూవాడాలో గణేష్‌ని మండపాలు సిద్ధమైయ్యాయి. పలు ప్రాంతాల్లో వినాయకుని భక్తులు విగ్రహాలను కొనుగోలు చేసి, 31న ప్రతిష్టించడానికి సిద్దమైయ్యారు.

అయితే, ఈసారి యూపీలోని చందౌసీలో తయారవుతున్న గణపతి దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. స్వర్ణకాంతులీనుతూ, భక్తులకు దర్శనమివ్వనున్నాడు. యూపీ చందౌసీలో రూపుదిద్దుకుంటున్న ఈ గోల్డెన్ గణపతి మాత్రం ఈసారి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

”ఈ గోల్డెన్ విగ్రహాన్ని తిరుపతి బాలాజీ స్టైల్‌లో తయారు చేస్తున్నాం. 18 అడుగుల విగ్రహంలో మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నాం. తిరుమల శ్రీవారి తరహాలో బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నాం” అని అన్నారు. ఈ క్రమంలో ఈ 18 అడుగుల గోల్డెన్‌ వినాయకుడి ఫోటోలు,వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.