అమెరికాకు రూ. 18 లక్షల కోట్ల నష్టం - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాకు రూ. 18 లక్షల కోట్ల నష్టం

September 11, 2017

హార్వే, ఇర్మా తుపాన్లు అగ్రరాజ్యం అమెరికాను అగ్రస్థాయిలోనే దెబ్బకొట్టాయి. ఈ రెండు ప్రకృతి బీభత్సాల వల్ల  ఆ దేశానికి రూ. 18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టం పెద్దగా లేకుండా భారీ ఆస్తినష్టం సంభవించింది. దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపారులు,  ఉద్యోగాలు, రవాణా, గోడౌన్లు, వంటి, మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఈ నష్టం నుంచి కోలువాలంటే పదేళ్లు పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నష్టపోయిన ఆస్తుల్లో చాలావాటికి బీమా సదుపాయం ఉండటంతో పెద్ద ఊరట లభించనుంది. ప్రస్తుతం ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో విలయం సృష్టిస్తున్న ఇర్మా వల్ల నష్టం మరింత పెరగొచ్చని భావిస్తుననారు. కాగా, ఇటీవలి హార్వే తుపాను అమెరికా దేశ చరిత్రలో అత్యంత భారీ నష్టం కలిగించిన తుపాను.