ఆర్మీ చేతిలో 18 మంది ఉగ్రవాదులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీ చేతిలో 18 మంది ఉగ్రవాదులు హతం

October 23, 2019

Indian army ..

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ముష్కరుల కోసం ఇండియన్ ఆర్మీ వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నీలం వ్యాలీతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో కొందరు పాక్‌ సైనిక సిబ్బంది కూడా మరణించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. 

భారత సైన్యం దాడుల్లో జైషే మహ్మద్‌ సహా ఇతర టెర్రరిస్ట్ సంస్థలకు చెందిన లాంఛ్‌ ప్యాడ్లను ఆర్టిలరీ ఫైరింగ్‌తో ధ్వంసం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో భారత్ ఎదురుదాడికి దిగింది. పాక్‌ ఆర్మీకి చెందిన ఆయుధ సామాగ్రి, రేషన్‌ డిపోలను కూడా సైన్యం ధ్వంసం చేసింది.