ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. 18 మంది రచయితలు, హేతువాదులు, అభ్యుదయవాదులకు పోలీసు భద్రత కల్పించింది. వీరి ప్రాణాలకు మతచాంధసవాదుల నుంచి ముప్పు ఉందని, ముఖ్యంగా హిందూ అతివాదుల నుంచి హని ఉందని, వీరికి రక్షణ కల్పించాలని నిఘా వర్గాలు సిద్ధరామయ్య ప్రభుత్వానికి సూచించాయి. పోలీసు సెక్యూరిటీ కల్పించిన రచయితల్లో ప్రముఖ నాటకకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీశ్ కర్నాడ్, ఇతర రచయితలు బరగూర్ రామచంద్రప్ప, పాటిల్ పుట్టప్ప, చెన్నవీర కనవి తదితరులు ఉన్నారు. లింగాయతులను ప్రత్యేక మతంవారికిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న ఎస్ఎం జందార్ కు కూడా పోలీసు రక్షణ కల్పాంచారు. ఇటీవల పలువురు రచయితలు, మేధావులకు వచ్చిన బెదిరింపులను నిఘా వర్గాలు విశ్లేషించాయి. తక్కువ ముప్పు ఉన్నవారికి ఒక గన్ మెన్ ను, ఎక్కువ ముప్పు ఉన్నవారికి ఎక్కువ భద్రతను కల్పిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరి చెప్పారు. కర్ణాటకలో హేతువాది రచయిత కలబుర్గిని ఇదివరకు హత్యకు గురికాగా, తాజాగా గౌరీ లంకేశ్ ను దుండగులు చంపేశారు. హిందూ ఉగ్రవాదులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.