అమెరికాలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు.. 21 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో 18 ఏళ్ల యువకుడు కాల్పులు.. 21 మంది మృతి

May 25, 2022

అమెరికాలో 18 ఏళ్ల యువకుడు తుపాకితో హల్‌చల్ చేశాడు. టెక్సాస్‌లో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతోపాటు ముగ్గురు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దుండగుడిపై కాల్పులు జరపడంతో, ఆ కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. ”మెక్సికన్ సరిహద్దులోని ఉవాళ్లే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడికి 18 ఏళ్ల వయసు ఉంటుంది. తుపాకీతో రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించి, విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పాఠశాలలో విధులు నిర్వహించే వారు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుంది. పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు.”

మరోపక్క అమెరికాలో 2018 తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో అప్పట్లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇప్పుడు 11 మంది చిన్నపిల్లలు, ముగ్గురు పెద్దవారు మృతి చెందారని అధికారులు వివరాలను వెల్లడించారు.