18 years after nikah, Muslim American couple ties knot in Hindu style at UP temple
mictv telugu

గుళ్లో మళ్లీ పెళ్లి చేసుకున్న ముస్లిం జంట

September 20, 2022

పెళ్లై 9 మంది సంతానం ఉన్న ఓ ముస్లిం జంట.. హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అమెరికాకు చెందిన కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫాలు.. 18 ఏండ్ల తర్వాత యూపీలోని జౌన్‌పూర్‌ త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు.18 ఏళ్ల క్రితం నికాహ్ (పెళ్లి) చేసుకున్న ఖలీపా దంపతులకు 9మంది పిల్లలు ఉన్నారు.ఈ దంపతులకు ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారి రవిశంకర్ గిరి మళ్లీ పెళ్లి చేశారు. తన తాత భారతీయ సంతతికి చెందిన హిందువు అని కేషా ఖలీఫా పేర్కొన్నారు.

పెళ్లికి సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు హిందూ సంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయని దంపతులతో పాటు వచ్చిన పండిట్ గోవింద్ శాస్త్రి తెలిపారు. ముస్లిం దంపతులు హిందూ ఆచారాల ప్రకారం అగ్నిని సాక్షిగా భావించి త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేశారు .ముస్లిం దంపతులు భారతదేశ పర్యటనలో భాగంగా వారణాసి ఘాట్‌లు, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించిన సమయంలో హిందూ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో వారు హిందూ ఆచారాల ప్రకారం మళ్లీ వివాహం చేసుకోవాలనుకొని, అందుకు భగవంతుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు.