ట్యాంకులో 1800 టన్నుల స్టైరిన్..టైం పడుతుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్యాంకులో 1800 టన్నుల స్టైరిన్..టైం పడుతుంది..

May 7, 2020

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున ఒక్కసారిగా స్టైరిన్ అనే విష వాయువు ఫ్యాక్టరీ నుంచి బయటికి లీక్ అయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది ఈ ఘటనలో మరణించారు. 

ఈ ప్రమాదంపై ఎల్జీ పాలిమార్స్ కంపెనీ స్పందించింది. లాక్ డౌన్ కారణంగా కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్ లో లేకపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 2400 టన్నులు కాగా.. ప్రస్తుతం 1800 టన్నుల స్టైరిన్ మోనోమర్ ట్యాంకులో ఉందని కంపెనీ జనరల్ మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ప్రస్తుతం ఇన్హిబిటర్ తో కంట్రోల్ చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. దీనిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని, పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ప్రజలంతా గ్రామాలలోకి యథావిధిగా రావొచ్చని కంపెనీ ప్రకటించింది.