తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు

July 3, 2020

ts 1,894.

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకి వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,658 కేసులు నమోదుకావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు పెరిగింది. 

ఈరోజు 1,126 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా 10,195కి పెరిగింది. ఇక కరోనా మరణాల విషయానికి వస్తే.. ఈరోజు ఎనమిది మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 283కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,04,118 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 83,656 నెగిటివ్ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,984 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.