చాక్లెట్లు అమ్ముకునే వ్యక్తి ఖాతాలో 18కోట్లు...! - MicTv.in - Telugu News
mictv telugu

చాక్లెట్లు అమ్ముకునే వ్యక్తి ఖాతాలో 18కోట్లు…!

June 3, 2017

అతనో సామాన్యుడు..గల్లోలో చాక్లెట్లు అమ్ముతుంటాడు.ఎంత పొదుపు చేసినా అతని దగ్గర రెండు, మూడు లక్షలకు ఎక్కువ ఉండవు..కానీ అకౌంట్ లో మాత్రం 18 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఈ భారీ మొత్తం ఖాతలోకి ఎలా వచ్చింది.

ఇది జరిగింది ఎక్కడో తెలుసా..విజయవాడలో…గల్లీలో చాక్లెట్లు అమ్ముకునే వ్యక్తి ఖాతా నుంచి రూ.18కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది. ఇన్ని డబ్బులు ఎక్కడివి. ఎక్కడి నుంచి వచ్చాయి. ఇతని అకౌంట్ నుంచి కోట్ల లావాదేవీలు నడిపింది ఎవరు అనే యాంగిల్లో ఐటీ శాఖ దర్యాప్తు జరుపుతోంది. విజయవాడలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది.