పోలీసును దూషించిన వ్యక్తికి 19 నెలల జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసును దూషించిన వ్యక్తికి 19 నెలల జైలు శిక్ష

July 6, 2022

ప్లాట్‌ఫాంపై ఎందుకు పడుకున్నావు? లేచి వెళ్లిపో అన్న పోలీసును దూషించిన వ్యక్తికి కోర్టు 19 నెలల జైలు శిక్ష విధించింది. నేరం రుజువైనందున శిక్ష వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. పూర్తి వివరాలు.. 2020 నవంబర్ 24న ఈ ఘటన జరిగింది. ఆ రోజు అర్దరాత్రి మొహితె అనే పోలీసు సివిల్ డ్రెస్సులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సీఎస్ఎమ్టీ ప్లాట్‌ఫాం 15పై రామేశ్వర్ అనే వ్యక్తి పడుకొని ఉండడం గమనించి వెళ్లి లేపాడు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించగా, రామేశ్వర్ పోలీసుకు ఎదురు తిరిగాడు. ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఏం చేస్కుంటావో చేస్కో పో అంటూ ధిక్కార స్వరం వినిపించాడు. దీంతో అతడిని స్టేషనుకి తీసుకెళ్లి ఐపీసీ సెక్షన్ 353, 504 కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ప్రజా శాంతిని చెడగొట్టడం, ప్రజా సేవ చేస్తున్న వారిని అవమానించడం, బెదిరింపులకు గాను కోర్టు రామేశ్వర్‌కి 19 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.