19 years girl married 70 old man Pakistan Lahore love story
mictv telugu

70 ఏళ్ల తాతను లవ్ మ్యారేజ్ చేసుకున్న 19 ఏళ్ల పాప

November 17, 2022

ప్రేమ ఎప్పుడెలా పుడుతుందో చెప్పలేం. ఎవరిని ఎవరు ప్రేమిస్తారో ఊహించలేం. అందుకే ప్రేమ గొప్పది, మొండిది, గుడ్డిది. కొన్ని ప్రేమలు దేశాలు దాటితే కొన్ని దేశంలో కొత్త చరిత్రలు సృష్టిస్తుంటాయి. చూసేవాళ్లకు వినేవాళ్లకు ‘‘వార్నీ’’ అనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటి వింత ప్రేమ కథే. అతనికి 70 ఏళ్లు దాటాయి. ఆమెకు ఇంకా 19 ఏళ్లే. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అతని ఇంట్లో అతడే పెద్ద కాబట్టి సమస్య లేదు. ఆమె చిన్నది కాబట్టి ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా జంట పట్టుబట్టి పెళ్లాడేసింది.

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది ఈ ఉదంతం. వరుడు లిఖావత్ రోజూ వాకింగ్ కు వెళ్లేవాడు. వధువు షమైలా కూడా వెళ్లేది. పెద్దాయన తొలి చూపులోనే ప్రేమలో పడిపోయి పాటలు పాడాడు. ఆమెను ఆకట్టుకోడానికి మాంచి ప్రేమగీతాలు చక్కగా ఆలపించాడు. తాత ఏదో సరదాగా పాడుతున్నాడని షమైలా మొదట్లో పట్టించుకోకపోయినా తర్వాత అతని ప్రేమకు చలించిపోయింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లాడతామని ఇళ్లలో చెప్పేశారు. షమైలా తల్లిదండ్రులు నెత్తీనోరూ కొట్టుకుని ససేమిరా అన్నారు. ఆమె వినకుండా ‘చేసుకుంటే లిఖావత్ తాతనే చేసుకుంటా లేకపోతే అసలు పెళ్లే చేసుకోను’ అని భీష్మించింది. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులని ‘నీ ఇష్ట ప్రకారమే కానీ’ అన్నారు. బంధుమిత్లుల మధ్య పెళ్లయిపోయింది. ‘ఇందులో వింతేం లేదు భాయ్.. మాకు ఆత్మగౌరవం ఉంది. ఆమెను నేను గౌరవిస్తాను. ఆమె కూడా నన్ను గౌరవిస్తుంది. ప్రేమకు కావాల్సింది. యవసులో తేడాతో ఏ సమస్యా లేదు’ అదే అంటున్నాడు తాత. లిఖావత్‌కు ఇదివరకు పెళ్లయిందో లేదో అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు.