తెలంగాణలో కొత్తగా 1924 కరోనా వైరస్ కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 1924 కరోనా వైరస్ కేసులు 

July 8, 2020

telangana

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. సగటున రోజుకి 1900 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా ఈరోజు తెలంగాణలో 1,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈరోజు కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,590 కేసులు నమోదు కావడం గమనార్హం.

దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు పెరిగింది. కరోనా నుంచి కోలుకొని ఈరోజు 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17,279కు చేరింది. నేడు 11 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 324కు పెరిగింది. కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో 11,933 మంది చికిత్స పొందుతున్నారు.