తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా పాజిటివ్ కేసులు

September 27, 2020

vbn

తెలంగాణ కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న రాత్రి 8గంటల వరకు గుర్తించిన బాధితుల సంఖ్య 1,967గా పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 9 మంది చనిపోయారు. శనివారం 50,108 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. ఈ స్థాయిలో వ్యాధి నిర్ధారణ జరిగింది. ఒక్కరోజే కొత్తగా 2,058 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 83 శాతానికి చేరింది. 

ఇప్పటి వరకు మొత్తం 1,85,833 మందికి వ్యాధి సోకింది. వీరిలో 1,100 మంది చనిపోయారు. 1,54,499 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. ఇంకా 30,234 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా  24,607 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,50,869 శాంపిళ్లను వైద్యులు పరీక్షించారు.